పాలకొండలో ఇంటర్ విద్యార్థి మృతి

హాస్టల్ పై నుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాలపై నుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.