ధర్మవరంలో ఉగ్రవాదుల కలకలం

సత్యసాయి: ధర్మవరంలో ఉగ్రవాదుల కలకలం రేగింది. కోట ఏరియాలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో IB, NIA, స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పాకిస్థాన్‌కు అతను ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టీస్టాల్లో పనిచేస్తున్న నూర్ ఇంట్లో అనుమానిత వస్తువులు,16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.