చెరువుకు గండి.. ప్రాణభయంతో ప్రజలు

చెరువుకు గండి.. ప్రాణభయంతో ప్రజలు

AP: తిరుపతి జిల్లా ఒళ్లూరులో చెరువుకు గండిపడింది. ఈ క్రమంలో భారీ వరద పోటెత్తడంతో కళత్తూరు గ్రామం నీటమునిగింది. దీంతో అక్కడి గ్రామస్తులు ప్రాణభయంతో ఇళ్లపైకి ఎక్కారు. ఈ వరదల్లో పశువులు మరణించాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీలైనంత త్వరగా గండి పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.