ప్రతిపాదనలకే పరిమితం అవుతున్న ఔట్‌ఫాల్ స్లూయిస్‌ల మరమ్మతులు
కృష్ణా: అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని 14 ఔట్‌ఫాల్ స్లూయిస్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సముద్ర ఆటుపోట్ల సమయంలో ఉప్పునీరు కాలువల ద్వారా పంటపొలాల్లోకి రాకుండా ఇవి అడ్డుకుంటాయి. అయితే ఇవి ఏళ్ల నాటివి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. గేట్లు సైతం తుప్పుపట్టిపోయాయి. ప్రభుత్వానికి నివేదించిన అవి ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.