VIDEO: తుఫాన్ ఎఫెక్ట్.. ట్రాక్టర్లు దొరకక రైతుల అవస్థ
GNTR: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కొల్లిపర మండల రైతులు భయాందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి చిరుజల్లులు పడటంతో, ధాన్యాన్ని గోతాలలో నింపి రవాణా చేయడానికి ట్రాక్టర్లు దొరకక ఇబ్బంది పడినట్లు తెలిపారు. పొలాలు, రోడ్డు పక్కన ఉన్న వరి ధాన్యంపై గోనె పట్టాలు కప్పుకోవాల్సి వచ్చిందని పలువురు రైతులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు.