మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

KRNL: కృష్ణగిరి మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ పి.రంజిత్ బాషా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల్లోని విద్యార్థులకు అందుతున్న భోజన వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతలో రాజీ పడకుండా ఉండాలని సూచించారు. విద్యార్థులకు బోధన విషయంలొ మరిన్ని మెలుకువలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు.