గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
RR: డిసెంబర్ 8, 9వ తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కందుకూరు మండలంలో నిర్వహించే ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విధులను బాధ్యతతో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.