వేణారెడ్డికి రాఖీ కట్టిన ముస్లిం మహిళలు

SRPT: రక్షాబంధన్ పండుగ సందర్భంగా సూర్యాపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డికి ముస్లిం మహిళలు రాఖీ కట్టారు. మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మాజీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎండీ షాహీన్ బేగం అంజద్ అలీతో పాటు ఇతర మహిళలు శనివారం ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అని అన్నారు.