విద్యారంగంలో ఆజాద్ కృషి అద్వితీయం: కలెక్టర్

విద్యారంగంలో ఆజాద్ కృషి అద్వితీయం: కలెక్టర్

KMR: భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మంగళవారం KMR కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆజాద్ భారత స్వాతంత్య్ర సమరయోధుడని, 1947 నుంచి 1958 వరకు విద్యా మంత్రిగా పనిచేసి, UGC, IITల వంటి ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటుకు పునాది వేశారని కలెక్టర్ కొనియాడారు.