VIDEO: ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
SKLM: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం నరసన్నపేట మండలం బొరిగివలస, ముసిడిగట్టు పంచాయితీలలో తనిఖీ చేసింది. రహదారుల నిర్మాణ పనులను పరిశీలించి, నిధుల వినియోగం, వారికి అందించిన వేతనాలపై ఆరా తీసింది. ఈ తనిఖీల్లో డ్వామా పీడీ లవ రాజు, ఏపీవో యుగంధర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.