VIDEO: వార్డులో మౌలిక వసతులు కల్పించాలని వినతి

VIDEO: వార్డులో మౌలిక వసతులు కల్పించాలని వినతి

ATP: గుత్తి మున్సిపాలిటీలోని Z. వీరారెడ్డి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే తనయుడు గుత్తి మండలం ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ పర్యటించారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సీపీఎం నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లను ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయాలలో విషపురుగులు సంచరిస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.