డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
KMM: కారేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఏర్పాట్లపై పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారులతో సమావేశమై, ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.