పందులను దూరంగా తరలించాలి: కమిషనర్

పందులను దూరంగా తరలించాలి: కమిషనర్

కడప: పందులను పట్టణానికి దూరంగా తరలించాలని మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పులివెందులలో పందుల బెడద అధికంగా ఉండడంవల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అనేక సార్లు ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని పట్టణానికి దూరంగా తరలించాలని తెలిపినా వాటిని తరలించడంలో పందుల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.