దేవాలయ భూమి కబ్జా చేశారని ఫిర్యాదు
MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలో దేవాలయ భూమి కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్డు సభ్యురాలు ర్యాకల నిర్మల కుమార్ గౌడ్ బుధవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దేవాలయ భూమిని అక్రమంగా కబ్జా చేసి వెంచర్ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తూ, కబ్జాను అడ్డుకుని దేవాలయ భూమికి రక్షణ చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.