విలేఖరి ముసుగులో బెదిరింపులు.. విలేఖర్ అరెస్ట్
MHBD: తొర్రూరు పట్టణంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ముసుగులో బెదిరింపులకు పాల్పడి బాధితుల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసిన కేసులో ప్రముఖ వార్త పత్రిక విలేఖర్ చెడుపాక పోల్ రాజును మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల అరెస్ట్ చేస్తామన్నారు.