కళ్లకు గంతలు కట్టుకొని నిరసన

GNTR: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. గుంటూరు DMHO కార్యాలయం ఎదుట చేస్తున్న సమ్మె బుధవారం 10వరోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధనలు ప్రకారం ఉద్యోగ భద్రత కలిపించాలని, NHM ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని కోరారు.