గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు నివాళి

WGL: న్యూ శాయంపేట 31వ డివిజన్‌లో గాంధీ జయంతిని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్ రావు నేడు మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశం కోసం గాంధీ, బహుదర్ శాస్త్రి సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో కంకుకుంట్ల కృష్ణ, అరెల్లి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.