'ద్విచక్ర వాహనదారులకు గులాబీ పూల పంపిణీ'
హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ద్విచక్ర వాహనదారులకు ప్రతాపరుద్ర ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు గులాబీ పూలను అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులను గుర్తించి గులాబీ పూలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ స్థానిక నాయకులు దార సూరి తో పాటు పలువురు పాల్గొన్నారు.