'పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి'

'పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి'

SRPT: పరిశ్రమల స్థాపనకు నిబంధనల మేరకు అధికారులు సకాలంలో అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన టీజీ-ఐపాస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీ-ప్రైడ్ కింద 143 మందికి రాయితీలు మంజూరు చేశామని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై యాజమాన్యాలతో త్వరలో సమావేశం నిర్వహించాలని సూచించారు.