జపాన్‌తో దోస్తీ.. నాటోపై ట్రంప్ ఫైర్
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు జపాన్‌తో కలిసి పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంలో జపాన్ సహకారం అద్భుతమని కొనియాడిన ఆయన, నాటో(NATO) దేశాలపై విమర్శలు గుప్పించారు. చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి విషయంలో నాటో దేశాలు ఏమాత్రం సాయం చేయడం లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇంధన భద్రత కోసం జపాన్-US బంధం బలపడుతోందని స్పష్టం చేశారు.