సీఎంకు ధన్యవాదాలు చెప్పిన అసదుద్దీన్ ఒవైసీ
HYDలో పాతబస్తీ వేగంగా అభివృద్ధి చెందుతోందని MP అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మెట్రోరైలు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చెరువును అభివృద్ది చేసిన రేవంత్‌కు ధన్యవాదాలు చెప్పారు. రూ. 360 కోట్లతో మీరాలం చెరువుపై బ్రిడ్జికి శంకుస్థాపన చేయబోతున్నారని వెల్లడించారు. ఈనెల 14న పాతబస్తీలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సీఎం రాబోతున్నారని ప్రకటించారు.