భారీ వర్షాలతో నీట మునిగిన పంటలు

VKB: నవాబుపేట మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నీట మునిగిన పంటలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు.