మున్సిపాలిటీలో పనులపై విమర్శలు
VIDEO: కోస్గి మున్సిపాలిటీలో అధికారుల వింత పోకడలు విమర్శలకు దారితీస్తున్నాయి. పలు వార్డుల్లో డ్రైనేజీ లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నప్పటికీ, అధికారులు మాత్రం ఖాళీ ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. అవసరమైన చోట్ల పనులు నిలిచిపోగా, జనావాసాలు లేని చోట నిధులు ఖర్చు చేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.