VIDEO: ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి
KMM: సత్తుపల్లి మండలం కాకర్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా TDP బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి చల్లారి వెంకటేశ్వరరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అధికార పార్టీ అభ్యర్థి వెంకటేశ్వరరావును అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు దయానంద్ కోరారు.