కుప్పకూలిన టమాటా ధరలు

కుప్పకూలిన టమాటా ధరలు

అన్నమయ్య: మదనపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మార్కెట్‌కు 53 మెట్రిక్ టన్నుల టమాటాలు దిగుమతి అయ్యాయి. మేలు రకం టమాటాలు 10 కిలోలకు రూ.125, రెండో రకం రూ.100, మూడో రకం రూ.90 ధర పలుకుతున్నాయి. పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు.