నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి
WGL: పరకాల గీసుగొండ మండల స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వీరగోని రాజకుమార్ గీసుగొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో వీరి సతీమణి వీరాగోని కవిత రెండు పర్యాయాలు ఎంపీపీగా, ఒకసారి జడ్పీటీసీగా పదవులు నిర్వహించారు. గీసుగొండలో కాంగ్రెస్ వర్గపోరులో ప్రత్యర్థులను చిత్తుచేయడానికి కంకణం కట్టుకుని నామినేషన్ వేశారు.