నేడు రాత్రి చలి..త్వరలో లైట్ రెయిన్..!
HYD పరిసరాల్లో రాత్రివేళ తీవ్రంగా చలి నమోదు అవుతోంది. నేడు రాత్రి కూడా ఇదే చలి తీవ్రత ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణం చల్లగానే ఉండనుంది. ఇదిలా ఉండగా.. నవంబర్ చివరి వారంలో చిరు జల్లులతో కూడిన వర్షాల సూచనలు ఉన్నాయని పేర్కొంది.