గుంతల మయంగా మారిన రోడ్డుతో ఇబ్బందులు

గుంతల మయంగా మారిన రోడ్డుతో ఇబ్బందులు

MNCL: జన్నారం గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జన్నారంలోని ఎఫ్డిఓ కార్యాలయం, హరిత రిసార్ట్స్ మీదుగా ఆ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. అధికారులు స్పందించి కొత్త రోడ్డును వేయాలని ప్రజలు కోరారు.