లోతట్టు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాం: కలెక్టర్

లోతట్టు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాం: కలెక్టర్

HYD: భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్నట్లు HYD కలెక్టర్ హరిచందన గురువారం అన్నారు. GHMC, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, జిల్లాలో 58 లోతట్టు ప్రాంతాలు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఆఫీసుల్లో నుంచి ఉద్యోగులు ఒకేసారి బయటకు వచ్చి ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడొద్దని సూచించారు.