రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

VZM: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. డెంకాడలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు పంపిణీ కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు జమ చేశామని తెలిపారు. రైతులకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాసుదేవరావు పాల్గొన్నారు.