వైద్యం వికటించి చిన్నారి కంటి నుంచి రక్తస్రావం
NLG: జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రిలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని ఓ కంటి ఆసుపత్రిలో వైద్యం వికటించి చిన్నారి కంటి నుంచి రక్తంస్రావం అయ్యింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. ఆసుపత్రి సిబ్బంది వైద్యం చెయ్యమని బెదిరింపులకు గురి చేశారని తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.