ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సన్మానించిన నేతలు

NGKL: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. స్థానిక ఎంపీ డాక్టర్ మల్లు రవితో పాటు టీపీసీసీ సభ్యులు చింతపల్లి జగదీశ్వర్ రావు తదితరులు సుదర్శన్ రెడ్డికి హైదరాబాదులోని విమానాశ్రయంలో శాలువా కప్పి సన్మానం చేశారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.