'3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం'
MDK: తూప్రాన్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం (పోతరాజుపల్లి)లో ఈనెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు. తూప్రాన్ సబ్ డివిజన్ పరిధి తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, శివంపేట, మాసాయిపేట మండలాల పరిధిలోని వినియోగదారులు సమస్యలపై వినతి చేయాలని సూచించారు. సంబంధిత ఏఈలు అందుబాటులో ఉంటారని తెలిపారు.