రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

విజయనగరం: గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మెంటాడ రోడ్డు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా విజయనగరం నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.