వైద్య రంగంలో మహిళల సేవలు అమోఘం: కలెక్టర్

వైద్య రంగంలో మహిళల సేవలు అమోఘం: కలెక్టర్

KMM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మహిళా వైద్యులకు ఘనంగా సన్మానం చేశారు. రోగులకు సేవలందించడంలో మహిళా డాక్టర్లు పోషిస్తున్న పాత్రను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలోని వైద్య సేవలపై, సిబ్బంది కృషిపై ఆయన ప్రశంసలు కురిపించారు.