బీజేపీలో చేరిన ప్రముఖ నటి

TG: నటి పూజిత జొన్నల గడ్డ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితురాలై ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ముఖ్యంగా యువత, మహిళల సమస్యల పరిష్కారం కోసం, రాజకీయ వేదిక ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు ఆమె తెలిపారు.