అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన JC

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన JC

NTR: విజయవాడ రామవరప్పాడులో అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సందర్శించారు. ఈ కేంద్రం ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పౌష్టిక ఆహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్న తీరును పరిశీలించారు. ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా సిబ్బందికి సూచనలు ఇచ్చారు.