రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
NGKL: పెంట్లవెల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. వాహనం నడుపుతూ మొబైల్ ఉపయోగించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని ఎస్సై పవన్ కుమార్ హెచ్చరించారు. అనంతరం సర్పంచ్ చిట్టెమ్మ సురేందర్ గౌడ్‌తో కలిసి గ్రామస్థులు రోడ్డు నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.