నీట్ పీజీ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

ADB: నీట్ పీజీ ఫలితాలలో ఆదిలాబాద్ యువతి సత్తా చాటింది. తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన ఉపాద్యాయుడు గండ్రత్ నారాయణ, సురేఖ దంపతుల కుమార్తె గండ్రత్ యజ్ఞ కాకతీయ యూనివర్సిటీలో పీజీ అభ్యసించి ఆల్ ఇండియాలో 7931 ర్యాంక్ సంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ మేరకు తల్లిదండ్రులు, కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.