సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
AP: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ముక్తేశ్వరం, చెన్నుపల్లిలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఇచ్చిన మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి ఇంట్లో విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. లోకేష్ తీసుకొచ్చిన మార్పులతో ఉత్తీర్ణత శాతం పెరుగుతోందని చెప్పారు.