మద్యం కేసుపై జోగి రమేష్ పిటిషన్
AP: నకిలీ మద్యం కేసుకు సంబంధించి మాజీమంత్రి జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ చేయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వచ్చే మంగళవారం జోగి రమేష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది. కాగా, ఇప్పటికే నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్థన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.