సూర్యాపేట పట్టణ శివారులో కారు-లారీ ఢీ
సూర్యాపేట పట్టణ శివారులో జాతీయ రహదారి 365పై గురువారం తెల్లవారుజామున ఓ కారు వెనుక భాగాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో వాహనాలు దెబ్బతిన్నప్పటికీ ఎవరికి గాయాలు కాలేదన్నారు. సమాచారం తెలుసుకున్న చివ్వెంల పోలీసులు, జాతీయ రహదారి భద్రత సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.