బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత పెంపు

బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత పెంపు

బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రతపై ఆ దేశ ప్రభుత్వం దృష్టి సారించింది. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో హిందువులకు భద్రతను పెంచాలని నిర్ణయించింది. హిందూ ఆలయాలు, కాలనీల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. బంగ్లా సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా పెట్టింది. కాగా.. గతంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు బంగ్లాలోని మైనార్టీపై దాడులు జరిగాయి.