కుటుంబ కలహాలు.. ఒకరు మృతి
KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ముత్తగూడెంకు చెందిన గుణగంటి నరేష్ తన మేనమామ వెంకటేశ్వర్లు కూతురిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. దీనిపై ఆగ్రహించిన వెంకటేశ్వర్లు తన కుమారుడు మనోజ్‌తో కలిసి నరేష్ కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నరేష్ తల్లి నాగమణి మృతి చెందగా, నరేష్ తీవ్రంగా గాయపడ్డాడు.