'చేతి పంపుకు మరమ్మతులు చేయించండి'

NLR: సైదాపురం మండలం మర్లపూడి పంచాయతీ దళితవాడ కాలనీలో ఏడాది నుంచి చేతి పంపు మరమ్మతులకు గురైనట్లు స్థానికులు తెలిపారు. దీని వలన తాగునీటికి ఇబ్బందిగా ఉందన్నారు. తమ గ్రామంలో మంచి నీటికి చేతి బోర్లే ఆధారమని, అధికారులు స్పందించి వాటికి మరమ్మతులు చేయాలని వారు కోరారు.