అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన

అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన

WG: నరసాపురంలోని మొగల్తూరు మండలంలో కాళీపట్నం వెస్ట్ పంచాయతీ పరిధిలోని పలవపాలెం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని ప్రశ్నించిన వారిపై ఎమ్మెల్యే అనుచరులమని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు.