నేడు ఏయూ బంద్
VSP: ఏయూలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలకు నిరసనగా విద్యార్థి సంఘాలు బుధవారం ఏయూ బంద్‌కు పిలుపునిచ్చాయి. మంగళవారం గ్రౌండ్‌లో చోటుచేసుకున్న ఘర్షణలు, విద్యార్థులపై జరిగిన దాడులను ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు తెలిపారు. తెల్లవారుజాము నుంచే విద్యార్థి నాయకులు హాస్టళ్లను సందర్శించి, తరగతులను బహిష్కరించి బంద్‌కు సహకరించాలని కోరుతున్నారు.