'బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలి'
ATP: జిల్లాలోని ప్రస్తుతం ఉన్న బాలల సంరక్షణ కేంద్రాలను సంబంధిత శాఖ అధికారులు తనిఖీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. సంరక్షణ కేంద్రాలలో బాలలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందించాలన్నారు.