చిట్టేడులో మృతదేహం లభ్యం

TPT: చిల్లకూరు మండలం చిట్టేడు వద్ద పూర్తిగా కాలిపోయిన మృతదేహం కలకలం రేపింది. మృతుడు కోటకు చెందిన హరికృష్ణగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చిల్లకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.