మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: టేకులపల్లి మండల పరిధిలోని బేదంపూడి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళారుల బారి నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు పిలుపునిచ్చారు.